![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ''ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో..... ధీరజ్ కి ప్రేమ భోజనం తీసుకొని వెళ్తుంది నువ్వు ఏంటే ఇక్కడ అని ధీరజ్ అడుగుతాడు. నువ్వు ఇక్కడ ఉంటే నా మనసు అక్కడ ఎలా ఉంటుందిరా అని ప్రేమ అంటుంది. దానితర్వాత ప్రేమ తనకి భోజనం తినిపిస్తుంది. అసలు ఇదంతా నా వళ్లే కదా.. నీకు కోపంగా లేదా.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అని ప్రేమ బాధపడుతుంటే అవన్నీ నువ్వేం ఆలోచించకు అని ధీరజ్ దైర్యం చెప్తాడు. మరొకవైపు వల్లికి సుకన్య భోజనం తినిపిస్తుంది. ఒసేయ్ నువ్వు ముందు భోజనం తిను.. ఎవరైనా వచ్చారంటే మరిది స్టేషన్ లో ఉన్న బాధ లేకుండా ఎలా తింటుందోనని అనుకుంటారని సుకన్య అంటుంది.
అప్పుడే చందు వస్తాడు. తను రావడం గమనించి నాకు ఆకలిగా లేదని యాక్టింగ్ మొదలుపెడుతుంది కానీ చందు సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఏంటే మన మాటలు గానీ విన్నాడంటావా అని వల్లి అనగానే వింటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావ్.. పుట్టింట్లో ఉంటావని సుకన్య అంటుంది. ఆ తర్వాత వేదవతికి రామరాజు భోజనం తీసుకొని వస్తాడు. మీరు తిన్నారా అని వేదవతి అడుగుతుంది.లేదని రామరాజు అంటాడు. మీకేనా కడుపు తీపి.. నాకు లేదా.. వాడు అలా ఉంటే ఎలా తినగలనని వేదవతి ఏడుస్తుంది. ఆ తర్వాత సేనాపతి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంటే రామరాజు కత్తి పట్టుకొని వెళ్తాడు. నా కుటుంబాన్ని పగపట్టావు కదరా.. నిన్ను బ్రతకనివ్వనని రామరాజు తన పైకి వెళ్తుంటే తిరుపతి వచ్చి అడ్డుపడతాడు. ఇప్పుడు మనం ఆవేశపడకూడదు బావ అని రామరాజుని తిరుపతి కూల్ చేస్తాడు.
ఆ తర్వాత ప్రేమ ఏడుస్తూ.. ఇదంతా నావల్లే నావల్ల వచ్చిన సమస్యని నేనే దూరం చేస్తానని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికి తిరిగి వస్తేనే వాడు బయటకు వస్తాడన్న భద్రవతి మాటలు ప్రేమ గుర్తుచేసుకుంటుంది. మరోవైపు అంత ఈ పెళ్లి చెయ్యడం వల్లే అన్న వేదవతి మాటలన్నీ గుర్తు చేసుకొని ప్రేమ వాళ్ళ ఇంటికి బయల్దేరుతుంది ప్రేమ. అలా ప్రేమ వెళ్ళడం సుకన్య చూసి వల్లికి చెప్తుంది. ప్రేమ వాళ్ళింటికి వెళ్ళిపోయిందని వల్లి, సుకన్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ వెళ్ళడం నర్మద చూసి తన వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |